రొయ్యల ఎగ్ పులుసు

Eggs - 4
రొయ్యలు - 500 gms
ఉల్లిపాయలు - 2 తరిగినవి
టమోటాలు - 1 తరిగినవి
చింతపండు - 2 నిమ్మకాయంతవి
మెంతులు - 1 చిటికెడు
పసుపు - 1 teaspoon
కారం
ఉప్పు
ముందుగ చింతపండు నుంచి చిక్కటి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
Eggs ని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి.
ఒక బాండలి లో తగినంత నూనె పోసుకొని కాగాక తరిగిన ఉల్లిపాయలను, మెంతులను వేయించుకోవాలి.
వేగాక టమోటాలు, పసుపు ని వేసి వేయించుకోవాలి.
వేగాక తగినంత కారం, ఉప్పు వేసి కలుపుకొని కడిగి పెట్టిన రొయ్యలని కలిపి 10 నిముషాలు వేయించుకోవాలి
తర్వాత చింతపండు రసాన్ని కూడా కలిపి ఉడకపెట్టాలి. నూనె తేలేంత వరకు ఉడకపెట్టాలి.
తర్వాత ఉడికిన eggs ని వేసి కలిపి 10 నిముషాలు ఉడకపెట్టి దించేయాలి.



