Create PDF Recommend Print

పంప్లేట్ ఫిష్ రోస్ట్

పంప్లేట్ - 2 pieces
కోడి గ్రుడ్లు - 1
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 teaspoon
కారం
పసుపు - 1 teaspoon
చిల్లి సాస్
సోయ్ సాస్
కార్న్ ఫ్లోర్
మైదా
ఉప్పు
గార్నిష్ కొరకు
ఉల్లిపాయలు - 1
కారట్ - 1
బీన్స్ - 4


1 . ముందుగ రెండు చేప ముక్కలకు కత్తి తో ఘాట్లు పెట్టాలి. Picture లో చూపిన విధం గా పెట్టాలి
చేప మొత్తం కట్ కాకుండా జాగర్త పడాలి.
చేప రెండు వైపులా ఘాట్లు పెట్టాలి



2 ఇప్పుడు తగినంత కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 tablespoon చిల్లి సాస్ , 1 teaspoon సోయ్ సాస్. 2 tablespoons  కార్న్ ఫ్లోర్ , 1 tablespoon  మైదా కోడి గ్రుడ్లు, 1 teaspoon వైట్ పెప్పర్ , చిటికెడు అజినోమోటో, ఉప్పు , 1 teaspoon orangeకలర్ ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ముద్దలు లేకుండా బాగా కలుపుకొని పేస్టు ని పక్కన పెట్టుకోవాలి.

3 తాయారు చేసుకున్న మసాల ను చేపకు పట్టించి 5 - 6 గంటలు ఉంచాలి
చేప ను చేతిలోకి తీసుకుని కొంచం వంచి మసాల అంత ఘాట్లు మధ్య అంత రాయాలి. చేపకు మొత్తం రాయాలి రెండు వైపులా.



4 ఈలోపు గార్నిష్ కొరకు ఉంచిన కూరగాయలను తీసుకుని సన్నగా నిలువుగా కోసుకువాలి.
ఇందులో 1 teaspoon white pepper , 1 teaspoon black pepper , ఉప్పు, 2 tablespoons నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి


5 ఒక kadai లో deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి
చేప పైన ఉన్న మాసాలను తీసి నూనె లోకి జాగర్తగా వేయాలి.  చేప రెండు వైపులా సగం ఉడికించాలి
ఉడికాక strainer లోకి తీసుకుని చేపను రెండు వైపులా వంచాలి . ఇలా చేస్తే చేప మంచిగా ఉడుకుతుంది.



6 ఇప్పుడు ఇలా చేసిన చేప ను మల్లి నూనె లో కి వేసి పూర్తి గ ఉడికేంత వరకు ఉంచాలి.
ఉడికాక తయారు చేసిన కూరగాయలతో గార్నిష్ చేసుకుని వేడి వేడి గా తినండి.
ఎంతో రుచి గా ఉండే పంప్లేట్ ఫిష్ రోస్ట్  రెడీ.