చికెన్ లాల్లిపోప్
చికెన్ రెక్క పై భాగము ముక్కలు - 6
కార్న్ ఫ్లోర్
మైదా
చిల్లి సాస్
సోయ్ సాస్
కలర్
కోడి గ్రుడ్డు
అజినోమోటో
కారం
అల్లం వెల్లుల్లి పేస్టు
ఉప్పు
చాట్ మసాల పొడి
నూనె
1 చికెన్ రెక్క పై భాగము తీసుకొని చూపిన విధముగా చేసుకోవలెను, లాల్లిపోప్ మాదిరి చేసుకోవలెను.



2 ఇప్పుడు ఒక కోడి గ్రుడ్డు ని గిలకొట్టి పక్కన పెట్టుకోవలెను.
ఒక గిన్నెలో రెండు tablepsoons కార్న్ ఫ్లోర్, ఒక tablespoon మైదా, 2 teaspoons చిల్లి సాస్, 1 teaspoon సోయ్ సాస్, తగినంత కారం, ఉప్పు, చిటికెడు అజినోమోటో, కలర్, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కోడి గ్రుడ్డు తో పేస్టు లాగ కలుపుకోవాలి.
తయారు చేసుకున్న పేస్టు ని ముక్కలకు బాగా పట్టించాలి.

3 ఇప్పుడు ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె పోసి కాగాక చేసుకున్న ముక్కలను పూర్తిగా ఉడికేంత వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు ఒక చిల్లెల్ల గిన్నెలోకి తీసుకొని చాట్ మసాల పొడి ని చల్లి వేడి వేడి గా తినాలి.




