Create PDF Recommend Print

చికెన్ ముఘలై బిర్యాని

కావలసిన పదార్థాలు

చికెన్ బిర్యాని - 1 కప్ తయారు చేసినది

వెజ్/నాన్ - వెజ్ షేర్వ - 2 cups ( షేర్వ ని తయారు చేసే విధానము)

ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినది

టమోటాలు - 2  సన్నగా తరిగినది

అల్లం వెల్లుల్లి పేస్టు - 1 teaspoon

కోడి గ్రుడ్డ్లు - 2

చిల్లి సాస్

సోయ్ సాస్

వైట్ పెప్పర్

అజినోమోటో

కారం

కొత్తిమీర - 1 స్పూన్ తరిగినది

ఉప్పు

నూనె


తయారు చేసే విధానము

 

చికెన్ బిర్యాని

 

ముందుగ బిర్యాని ని చేసి పక్కన పెట్టుకోవలెను. (ఈ విధముగా చేసిన పరవాలేదు)

చికెన్ ముఘలై బిర్యాని

 

ఒక బాండలి లో తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో గ్రుడ్డ్లను కొట్టి బాగా గిలకోట్టుకోవాలి. ఇలా రెండు నిముషాల పాటు చేసుకోవాలి.

ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు టమోటా ముక్కలను , అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించుకోవాలి.

ఇప్పుడు ఒక tablespoon చిల్లి సాస్, teaspoon సోయ్ సాస్, తగినంత కారం, ఉప్పు, చిటికెడు అజినోమోటో, ఒక teaspoon వైట్ పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోవాలి.

ఇందులో షేర్వ ని కూడా పోసి నిముషం పాటు కలుపుకోవాలి.

ఇందులో చేసుకొన్నా బిర్యాని ని కూడా వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి.

ఆఖరున కొత్తిమీర చల్లి దించేయాలి.

అంతే చికెన్ ముఘలై బిర్యాని రెడీ.