చికెన్ గ్రేవి

చికెన్ - 1 kg చిన్న ముక్కలుగా చేసినవి
ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినది
టమోటాలు - 2 పెద్ద ముక్కలుగా తరిగినవి
కారం - 2 tablespoons
ధనియాల పొడి - 1 tablespoon
కొబ్బరి పొడి - 1 tablespoon
అల్లం - 4 చిన్న ముక్కలు
వెల్లుల్లి - 6 రెప్పలు
పట్ట
ఉప్పు
పసుపు - 1 tablespoon
నూనె
ముందుగ టమోటా ముక్కలను, కారం, ధనియా పొడి, కొబ్బరి పొడి, అల్లం, వెల్లుల్లి, పట్ట అన్ని కలిపి పేస్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలి
ఒక kadai లో తగినంత నూనె పోసి కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి
వేగాక చేసుకున్న పేస్టు ని కూడా వేసి 5 నిముషాల పాటు వేయించాలి
వేగాక చికెన్ ముక్కలను, పసుపు, ఉప్పు, 4 గ్లాస్ ల నీళ్ళు పోసి మీడియం మంట మీద చికెన్ ఉడికేంత వరకు ఉడికించాలి
అంతే రుచి రుచి గా ఉండే చికెన్ గ్రేవి రెడీ.



