Create PDF Recommend Print

చికెన్ దం బిర్యాని

చికెన్ - 1 kg తరిగినది
పెరుగు - 2 cups
ఉల్లిపాయలు - 2 సన్నగా తరిగినవి
పచ్చి మిరపకాయలు - 10 తరిగినది
కారం - 1 tablespoon
ధనియాల పొడి - 1 tablespoon
పుదినా - 1 cup తరిగినది
కొత్తిమీర -1 cup తరిగినది
పసుపు - 2 tablespoons
పట్ట - half stick
లవంగం - 2
జాపత్రి - 1
మిరియాలు - 5
బిర్యాని ఆకులు - 4
నూనె
అన్నం కొరకు
బాస్మతి బియ్యం - 3 cups
నీళ్ళు - 5 cups
నూనె - 2 tablespoons
పట్ట

ముందుగ బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె లో నీళ్ళు, బియ్యం, నూనె, పట్ట వేసి సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళు వడర్చి పక్కన పెట్టుకోవాలి
కడిగి పెట్టుకున్న చికెన్ లో పెరుగు, పచ్చి మిరపకాయలు, పసుపు, ధనియాల పొడి, కారం, మిరియాలు, పుదినా, కొత్తిమీర వేసి ఒక 20 నిముషాల పాటు నాన పెట్టుకోవాలి.
వేరే గిన్నె లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులో బిర్యాని ఆకు, పట్ట, లవంగం, జాపత్రి వేసి రెండు నిముషాల పాటు వేయించాలి
ఇప్పడు తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి.
ఇప్పుడు నాన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మొత్తం పరిచాలి
ఉదికిన్చుకున్న బియ్యం ని కూడా వేసుకోవాలి
ఇప్పుడు ఒక thick cloth ని మూత కి చుట్టి పెట్టాలి.
మీడియం మంట మీద 20 నిముషాల పాటు ఉడికించాలి
అంతే చికెన్ దం బిర్యాని రెడీ.