ఎగ్ కర్రీ

కోడి గ్రుడ్లు - 4 ఉడక పెట్టి సగానికి కోసినవి
ఉల్లిపాయలు - 1 తరిగినది
టమోటాలు - 2 తరిగినది
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 teaspoon
పసుపు - 1 teaspoon
కారం
ఉప్పు
ఒక bowl తీసుకొని అందులో తగినంత నూనె పోసి కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి
అవి వేగాక తరిగిన టమోటా ముక్కలను, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించుకోవాలి.
5 నిముషాలు తరువాత తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
ఇప్పుడు ఉడక పెట్టుకొన్న కోడి గ్రుడ్లను కూడా వేసి కలిపి సన్నటి మంట మీద 5 నిముషాలు ఉంచి వేడి వేడి గా తింటే చాల బావుంటుంది



