Create PDF Recommend Print

చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్

 

కోడి గ్రుడ్లు - 6

బియ్యం - 2 cups అర్ధ గంట పాటు నాన పెట్టినవి

క్యాబేజీ - 1 /2 cup తరిగినది

క్యారట్ - 1 /2 cup తరిగినది

బీన్స్ - 1 /2 cup తరిగినది

కాప్సికం - 1 /2 cup తరిగినది

ఉల్లి కాడలు - 1 /2 cup తరిగినది

కొత్తిమీర - 1 /2 cup తరిగినది

చిల్లి సాస్

సోయ్ సాస్

వైట్ పెప్పర్

మిరియాలు

అజినోమోటో

ఉప్పు

నూనె

1  ముందుగ 5 cups నీళ్ళను ఉడక పెట్టుకోవాలి

నాన పెట్టిన బియ్యం నుండి నీళ్ళను వడార్చి ఉడికే నీళ్ళల్లో వేయాలి

10 నిముషాల పాటు ఉడకనివ్వాలి. 3 /4 th ఉడికేదాకా ఉడికించాలి.

ఒక గరిటె నూనె పోసి కలిపి దించేయాలి.

నీళ్లన్నీ వడార్చి వేరే గిన్నెలోకి ఉదికిన్చుకున్న అన్నం ని పెట్టుకోవాలి.

2. కూరగాయలన్నీ ఈ విధముగా cut చేసి పెట్టుకోవాలి.


3 రెండు గ్రుడ్లను పగలకొతీ తెల్ల సోన ని పక్కన పెట్టుకోవాలి.

మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపెట్టాలి

ఒక పెనం మీద కొంచం నూనె వేసి వేడి చేసుకొని ఈ గ్రుడ్డు మిశ్రమాన్ని పల్చటి omelette లాగ పోసుకోవాలి.

ఈ omelette ని చూపించిన విధం గా ముక్కలు చేసుకోవాలి.


4. ఇప్పుడు మిగిలిన పచ్చ సోన ని మిగతా గ్రుడ్లని కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఒక kadai లో 6 tablespoons నూనె పోసుకొని చేసుకున్న గ్రుడ్డు మిశ్రమాన్ని వేయాలి.

బాగా కలపాలి. గ్రుడ్డు చిన్న చిన్న ముక్కలుగా అయ్యేదాకా కలపాలి.

ఇప్పుడు కూరగాయలన్నీ వేసుకోవాలి. వీటిని కూడా మగ్గేన్తవరకు బాగా కలుపుతూ ఉండాలి.

ఇప్పుడు ఉదికీన్చుకున్న అన్నం ని, 1 tablespoon చిల్లి సాస్ , 1 teaspoon సోయ్ సాస్, చిటికెడు అజినోమోటో , 1 teaspoon వైట్ పెప్పర్, తగినంత ఉప్పు వేసుకోవాలి.

5 నిముషాల పాటు అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలని కూడా కలుపుకోవాలి.

దించబోయే ముందు తరిగిన ఉల్లి కాడలను, కొత్తిమీర ను చల్లి దించేయాలి.

అన్ని బాగా కలిపాలి. అంతే చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.