చికెన్ 64
కావలసిన పదార్థాలు
చికెన్ రెక్క ముక్కలు - 4
కోడి గ్రుడ్డు - 1
పచ్చి మిరపకాయలు - 4 నిలువుగా సగం కోసినవి
కార్న్ ఫ్లౌర్ - 2 tablespoons
మైదా - 1 tablespoon
చిల్లి సాస్ - 2 tablespoons
సోయ్ సాస్ - 1 tablespoon
టొమాటో సాస్ - 1 tablespoon
కారం
వైట్ పెప్పర్
అజినోమోటో
కరివేపాకు
ఉప్పు
కలర్
నిమ్మ రసం
నూనె
తయారు చేసే విధానము
ముందుగ గ్రుడ్డు ని గిలకొట్టి పక్కన పెట్టుకోవలెను.
ఒక గిన్నె లో కార్న్ ఫ్లౌర్, మైదా,చిల్లి సాస్, సోయ్ సాస్, టొమాటో సాస్ , 1 tablespoon వైట్ పెప్పర్, teaspoon నిమ్మ రసం, తగినంత ఉప్పు, కారం, చిటికెడు అజినోమోటో, కలర్ వేసుకొనవలెను.
వీటినన్నిటిని కోడి గ్రుడ్డు తో కలిపి చిక్కటి పేస్టు లాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
తరువాత చికెన్ ముక్కలను ఇందులో కలుపుకొని పెట్టుకోవాలి.
ఒక బాండలిలో deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
అందులో చికెన్ ముక్కలను వేసి ఉడికేంత వరకు fry చేయాలి.
ఆఖరున కరివేపాకు, పచ్చి మిరపకాయలను కూడా వేసి వేయించి దించేయాలి.
అంతే చికెన్ 64 రెడీ




