చికెన్ cutlet

చికెన్ (boneless ) - 250 gms
ఆలు గడ్డలు - 2 ఉడికించి పేస్టు చేసుకొన్నవి
ఉల్లిపాయలు - 1
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 tablespoon
పెరుగు - 1 tablespoon
ధనియాల పొడి - 1 /2 tablespoon
జీడిపప్పు - 10
కారం
పసుపు
ఉప్పు
నూనె
ముందుగ చికెన్ ముక్కలను కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఒక bowl తీసుకొని తగినంత నూనె పోసుకొని కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి.
వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు ని పసుపు ని వేసి 1 నిముషం వేగించి, కడిగిన చికెన్ ముక్కలని, పెరుగు, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి ఉడకపెట్టాలి.
చికెన్ ఉడికేదాకా వండాలి.
ఈ లోపు జీడిపప్పు ని వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఉడికించిన చికెన్ ని mixie jar లోకి తీసుకొని పేస్టు చేసుకోవాలి.
చేసుకొన్నా పేస్టు ని, మెత్తగా చేసుకొన్నా ఆలు తో కలుపుకోవాలి. తగినంత ఉప్పు కారం కూడా కలుపుకోవాలి.
వేరే బాండలి లో deep fry కి సరిపడా నూనె తీసుకొని వేడి చేసుకోవాలి.
నూనె కాగే లోపు చికెన్ ను ముద్దగా తీసుకొని patty ఆకారం లో చేసుకోవాలి.
కాగిన నూనె లో deep fry చేసుకోవాలి
చికెన్ patty రెడీ



