Create PDF Recommend Print

వంకాయ మెంతి కారం


వంకాయలు - 4 పెద్ద ముక్కలుగా కట్ చేసినవి
చింతపండు - 1 నిమ్మకాయంత
మెంతులు - 1 teaspoon
ఆవాలు - 1 tablespoon
ఎండు మిరపకాయలు - 6
మినపప్పు - 1 tablespoon
పసుపు
ఉప్పు
నూనె

  • ముందుగ చింతపండు నుండి రసం తీసి చింతపండు నీళ్ళు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఈ నీళ్ళల్లో వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి ఉడక పెట్టుకోవాలి.
  • ఒక పాన్ లో కొంచం నూనె పోసి కాగాక ఆవాలు, మినపప్పు, మెంతులు వేయించి. ఆఖరున ఎండు మిరపకాయలను వేసి దించేయాలి.
  • వీటితో కొంచం ఉప్పు వేసి అన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక పాన్ లో తగినంత నూనె పోసి కాగాక ఉడికించిన వంకాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి.
  • వేగాక చేసుకొన్నా పొడి ని చల్లి ఇంకొంచం సేపు వేయించి దించేయాలి.
  • అంతే వంకాయ మెంతి కారం రెడీ.