పెప్పర్ చికెన్
కావలసిన పదార్థాలు
చికెన్ - 1 cup ఎముకలు లేనివి, చిన్న చిన్న ముక్కలుగా చేసినవి
కోడి గ్రుడ్డు - 1
కొత్తిమీర - 1 cup తరిగినది
కార్న్ ఫ్లౌర్ - 3 tablespoons
మైదా - 1 tablespoon
చిల్లి సాస్ - 1 tablespoon
సోయ్ సాస్ - 1 teaspoon
వైట్ పెప్పర్
కారం
ఉప్పు
అజినోమోటో
నూనె
తయారు చేసే విధానము
ముందుగ చికెన్ ముక్కలను శుబ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవలెను.
ఒక గ్రుడ్డు ని గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి
వేరే గిన్నె లో కార్న్ ఫ్లౌర్ , మైదా, కారం, చిల్లి సాస్, సోయ్ సాస్, 2 - 3 tablespoons వైట్ పెప్పర్, చిటికెడు అజినోమోటో, తగినంత ఉప్పు వేసుకోవాలి.
వీటి అన్నిటిని కోడి గ్రుడ్డు వేసి చిక్కటి మిశ్రమంగా కలుపుకోవాలి.
సన్నగా తరిగిన కొత్తిమీర ను కూడా కలుపుకోవాలి. వీటిలోనే చికెన్ ముక్కలను కూడా కలుపుకోవాలి.

ఒక పాన్ తీసుకొని deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
అందులో చికెన్ ముక్కలను, కొత్తిమీర ను వేసి వేయించుకోవాలి.
వేయించిన వాటిని ఒక జల్లెడ గిన్నె లోకి తీసుకొని వైట్ పెప్పర్ చల్లుకోవాలి.
అంతే పెప్పర్ చికెన్ రెడీ.




