వెజిటబుల్ షేర్వ
కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు - 2 సన్నగా తరిగినవి
పచ్చి మిరపకాయలు - 8 నిలువుగా అడ్డంగా తరిగినది
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 tablespoon
టమోటాలు - 1
పెరుగు - 1 కప్
కారం
ధనియాల పొడి
పసుపు
ఉప్పు
నూనె
గరం మసాల పొడి
గసగసాలు - 1 tablespoon
సాయి పప్పు - 1 tablespoon
జీడి పప్పు - 1 tablespoon
తురిమిన పచ్చి కొబ్బరి - 1 tablespoon
తయారు చేసే విధానము
-
ఒక బాండలి లో రెండు spoons నూనె పోసి వేడి చేసుకోవాలి.
-
అందులో ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి.
-
అందులో కొంచం ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి.
-
అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచం సేపు వేగించాలి.
-
ఇప్పుడు తరిగిన టమోటాలు వేసి వేగించాలి.
-
అందులో పెరుగు, తగినంత కారం, ఉప్పు, చిటికెడు పసుపు, ఒక spoon ధనియాల పొడి, కొంచం నీళ్ళు వేయాలి. ఒక ఐదు నిముషాలు పాటు ఉడికించాలి.
-
ఇప్పుడు తయారు చేసిన గరం మసాల పొడి వేసి కూర చిక్క బడేంత వరకు ఉడికించాలి.
-
అంతే షేర్వ రెడీ.



