Create PDF Recommend Print

చామగడ్డ కూర

కావలసిన పదార్థాలు

చామగడ్డ - 4 ఉడికించి చిన్న ముక్కలుగా కోసినవి

ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినది

టమోటాలు - 2 సన్నగా తరిగినది

అల్లం వెల్లుల్లి పేస్టు - 1 tablespoon

పసుపు - 1 teaspoon

కారం

ఉప్పు

నూనె

తయారు చేసే విధానము

 

చామ గడ్డను ఉడక పెట్టె విధానము

 

  • ముందుగ చామ గడ్డలను pressure cooker లో వేసి రెండు cups నీళ్ళు పోసి సన్న సెగ మీద ఉడక పెట్టాలి.

  • ఉడికాక తొక్కు తీసి చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.

చామ గడ్డ కూర చేసే విధానము

  • ఒక బాండలి లో కొంచం నూనె పోసి వేడి చేసుకోవాలి.

  • అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.

  • వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు , టమోటాలు వేసి వేగించాలి.

  • అందులో కొంచం పసుపు , ఉప్పు కూడా వేయాలి. కొంచం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.

  • ఉడికాక అందులో తగినంత కారం వేసి ఒక ఐదు నిముషాల పాటు ఉడక నివ్వాలి.

  • అంతే చామ గడ్డ కూర తయారు.