టోఫు కాప్సికం కర్రీ
కావలసిన పదార్థాలు
టోఫు - 1 packet
Green కాప్సికం - 1 /2 చిన్న ముక్కలుగా చేసినవి
Red కాప్సికం - 1 /2 చిన్న ముక్కలుగా చేసినవి
ఉల్లిపాయలు - సగం సన్నగా తరిగినవి
కొబ్బరి పాలు - అర cup
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 teaspoon
కారం
గరం మసాల
పసుపు
ఉప్పు
నూనె
తయారు చేసే విధానము
ముందుగ టోఫు ని చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవలెను.
ఒక పాన్ లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు పసుపు,అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఇంకో రెండు నిముషాల పాటు వేయించుకోవాలి.
ఇందులో టోఫు వేసి ఒక నిఉమ్శం పాటు వేయించుకోవాలి.
ఇందులో తరిగి ఉంచుకున్న కాప్సికం ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి.
తగినంత కారం, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిముషాల పాటు ఉడక పెట్టుకోవాలి.
కొబ్బరి పాలు కూడా వేసి మూత పెట్టి పదిహేను నిముషాల పాటు medium మంట మీద ఉడికించుకోవాలి.
ఆఖరున గరం మసాల పొడి చల్లి ఇంకో నిముషం పాటు ఉడికించాలి.
కొత్తిమీర చల్లి వేడి వేడి టోఫు కాప్సికం కర్రీ రెడీ.



