పనీర్ కర్రీ
కావలసిన పదార్థాలు
పనీర్ - 1 cup చాల చిన్న ముక్కుగా చేసుకున్నవి
ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినది
టమోటాలు - 3 సన్నగా తరిగినవి
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 tablespoon
పసుపు
కారం
ధనియాల పొడి
గరం మసాల
ఉప్పు
నూనె
తయారు చేసే విధానము
ఒక పాన్ లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
అందులో తరిగిన టమోటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి
అందులో కొంచం పసుపు తగినంత కారం వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు పనీర్ ముక్కలు కూడా వేసి కలిపి చిన్న మంట మీద పనీర్ మెత్త బడే దాక ఉడికించాలి.
తరువాత తగినంత కారం, ధనియాల పొడి వేసి ఇంకో ఐదు నిముషాల పాటు ఉడికించాలి.
ఆఖరున గరం మసాల పొడి చల్లి కలిపి దించేయాలి.
అంతే పనీర్ కర్రీ తయార్.




