Create PDF Recommend Print

చాకలట్ గులాబ్ జామున్

జామున్ పొడి - 1 cup
డైరీ మిల్క్ చాకలట్ - 1
పాలు
చక్కెర
నీళ్ళు
నూనె
1 .  ముందుగ chocolate ని కొద్ది నీళ్ళల్లో కలిపి పేస్టు లాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2 .  తరువాత జామున్ పొడి తో ఈ పేస్టు ని కలుపుకోవాలి.
3 . ఇప్పుడు జామున్ పొడి packet లో చెప్పిన విధముగా కొద్ది కొద్ది గా పాలు పోస్తూ ముద్ద లాగ కలుపుకోవాలి.
4 . చక్కెర పాకం

  • ముందుగ రెండు గ్లాస్ ల చక్కెర లో రెండు గ్లాస్ ల నీళ్ళు కలిపి stove మీద పెట్టాలి.
  • చక్కెర మొత్తం కరిగే దాక కలుపుతూ ఉండాలి.
  • కరిగిన తరువాత ఒక 5 నిముషాల సేపు ఉంచి ఆపేయాలి.
5 . జామున్ లు చేసే విధానము
  • చేసుకున్న పిండి లో కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలు గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • అవి కాగాక అందులో చేసుకొన్నా ఉండలను కూడా వేసి వేగించాలి.
  • వేగిన తరువాతనే తీసి చేసుకొన్నా చక్కెర పాకం లో ఒక 5 నిముషాల పాటు ఉంచి తీయాలి.
  • అంతే chocolate తో గులాబ్ జామున్ రెడీ.