క్రిస్పి వెజిటబుల్స్
కాప్సికం - 1
కారట్ - 1
కోడి గ్రుడ్డు - 1
అల్లం వెల్లుల్లి పేస్టు
మైదా
కార్న్ ఫ్లోర్
చిల్లి సాస్
సోయ్ సాస్
అజినోమోటో
కారం
ఉప్పు
నూనె
1 ముందుగ కూరగాయలను చూపిన విధముగా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవలెను.
2 ఒక గిన్నెలో కోడి గ్రుడ్డు ను గిలకొట్టి పక్కన పెట్టుకోవలెను.
అందులో తగినంత కారం, ఉప్పు , రెండు tablespoons కార్న్ ఫ్లోర్ , 1 tablespoon మైదా, 2 teaspoons చిల్లి సాస్, 1 teaspoon సోయ్ సాస్, అర teaspoon అజినోమోటో, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అన్ని పేస్టు లాగ కలుపుకోవాలి.
ఇప్పుడు తరిగిన ముక్కలను వేసి కలపాలి.
3 ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె పోసి కాగాక ఒక్కొక్క ముక్కను వేసి వేయించాలి.
ఉడికాక ఒక చిల్లెల్ల గిన్నెలోకి తీసుకొని ఉడికిన ముక్కలను వేసి వాటి పైన చాట్ మసాల పొడి చల్లాలి.
పిల్లలకి ఎంతో ఇష్టమయిన snack ఐటెం రెడీ.






