Create PDF Recommend Print

చిల్లి గోబీ

 

గోబీ ముక్కలు - 1 కప్

పచ్చి మిరపకాయలు - 1 /2 కప్

వెల్లుల్లి - 1 /2 కప్

కార్న్ ఫ్లోర్

మైదా

చిల్లి సాస్

సోయ్ సాస్

అల్లం వెల్లుల్లి పేస్టు

వైట్ పెప్పర్

అజినోమోటో

కోడి గ్రుడ్డు

నూనె

1 ముందుగ కోడి గ్రుడ్డు ని గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి

కింద చూపిన విధముగా పచ్చి మిరపకాయలను , వెల్లుల్లి ని తరిగి పెట్టుకోవాలి.

2 ఒక గిన్నెలో తగినంత కారం, ఉప్పు, 1 tablespoon వైట్ పెప్పర్ , 2 tablespoons కార్న్ ఫ్లోర్ , 1 tablespoon మైదా , 2 teaspoons చిల్లి సాస్, 1 teaspoon సోయ్ సాస్, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు , కోడి గ్రుడ్డు, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పేస్టు లాగ కలుపుకోవాలి.

అందులో గోబీ ముక్కలను కూడా వేసి కలపాలి.

3 ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.

అందులో గోబీ ముక్కలను ఒక్కొక్కటి గా వేసి ఫ్రై చేసుకోవాలి.

అంతే చిల్లి గోబీ రెడీ.