Create PDF Recommend Print

రవ్వ ఇడ్లి

కావలసిన పదార్థాలు

ఉప్మా రవ్వ - 1 cup

పెరుగు - 1 cup

ఉప్పు

నీళ్ళు

కారట్ - 1 tablespoon తురిమినది

ఉల్లిపాయలు - 1 /2 cup సన్నగా తరిగినవి

అల్లం - 1 tablespoon సన్నగా తరిగినవి

ఆవాలు

పచ్చి శెనగపప్పు

నూనె


తయారు చేసే విధానము

ముందుగ బాండలి లో కొంచం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి.అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు వేసి వేయించాలి.
వేగాక ఉప్మా రవ్వ కూడా వేసి వేయించాలి.
వేగిన ఉప్మా రవ్వను ఒక bowl లోకి తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, తగినంత నీళ్ళు పోసి కలపాలి.
మామూలుగా తయారు చేసే ఇడ్లి పిండి లాగ తయారు చేసుకోవాలి.
అందులో కారట్ ముక్కలు, ఉల్లిపాయలు, అల్లం వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అర్ధ గంట పాటు నాన పెట్టాలి.


వీటిని ఇడ్లి పాతర్లో పెట్టి మామూలు ఇడ్లి చేసే విధానములోనే ఉడికించాలి.
అంతే ఎంతో రుచి గా ఉండే రవ్వ ఇడ్లి రెడీ.
దీనిని వేరుశెనగ పచ్చడి తో తింటే బావుంటుంది.