గుత్తి వంకాయ కూర
కావలసిన పదార్థాలు
వంకాయలు - 5
ఉల్లిపాయలు - 1 పెద్దది సన్నగా తరిగినది
టమోటాలు - 2 సన్నగా తరిగినది
చింతపండు - 2 నిమ్మకాయంత
వేరుశెనగపప్పు - 15 - 20
తరిగిన పచ్చి కొబ్బరి - 1 /2 cup
వెల్లుల్లి - 4 - 5
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 teaspoon
పసుపు - 1 teaspoon
కారం
ఉప్పు
ఆవాలు
మెంతులు
జీలకర్ర
ఎండు మిర్చి - 4
నూనె
తయారు చేసే విధానము
వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు తయారీ
-
ముందుగ వేరుశెనగపప్పు ని ఒక పాన్ లో వేయించుకోవాలి.
-
ఆఖరున ఎండు మిర్చి ని వేసి కూడా వేయించి దించేయాలి.
-
వేరేగా ఆవాలు, మెంతులు, జీలకర్ర, కూడా వేసి వేగించుకోవాలి. ఎక్కువ వేగించ వద్దు లేకపోతే చేదు వస్తుంది.
-
ఇప్పుడు వేగించుకున్న వాటిని అన్నిటిని, వెల్లుల్లి, ఉప్పు , పచ్చి కొబ్బరి కూడా వేసి కొంచం నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.


వంకాయలను కూర్చటం
-
వంకాయలను నాలుగు భాగాలుగా సగం వరకు కోసుకోవాలి. మొత్తం కోయకూడదు.
-
ఇప్పుడు మధ్యలో చేసుకున్న పేస్టు ని కూర్హ్సుకొని పక్కన పెట్టుకోవాలి.

గుత్తి వంకాయ కూర చేసుకోవడం
-
ఇప్పుడు చింతపండు ని వేడి నీళ్ళల్లో నాన పెట్టాలి. ఐదు నిముషాల పాటు ఉంచి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
-
ఇప్పుడు ఒక బాండలి లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
-
అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి. ఆఖరున అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
-
ఇప్పుడు చేసుకొన్నా వంకాయలను కూడా వేసి రెండు నిముషాల పాటు వేయించాలి.
-
అందులో తరిగిన టమోటా ముక్కలను కూడా వేసి ఉడికేంత వరకు వేయించాలి.
-
ఇప్పుడు చేసుకొన్న చింతపండు రసం ని కూడా వేసుకోవాలి.
-
అందులో తగినంత ఉప్పు, కారం పసుపు వేసి కలిపి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
-
అంతే గుత్తి వంకాయ కూర తయారు.




