బీన్స్ కర్రీ
కావలసిన పదార్థాలు
బీన్స్ - 1 cup ఉడక పెట్టి చిన్న ముక్కలుగా చేసినవి
ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినవి
టమోటాలు - 2 సన్నగా తరిగినవి
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 teaspoon
పసుపు - చిటికెడు
కారం
ఉప్పు
నూనె
తయారు చేసే విధానము
ముందుగ బీన్స్ ని ఉడక పెట్టి పక్కన పెట్టుకోవలెను.
ఒక పాన్ లో తగినంత నూనె పోసి కాగాక అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.
ఉల్లిపాయలు వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి ఒక నిముషం పాటు తిప్పుకోవాలి.
ఇప్పుడు తరిగిన టమోటా ముక్కలను కూడా వేసి అన్ని బాగా వేగెంత వరకు ఉంచాలి.
అన్ని వేగాక ఉడక పెట్టిన బీన్స్ ని, కారం, ఉప్పు వేసి బాగా కలిపి medium మంట మీద ఐదు నిముషాల పాటు ఉడికించుకోవాలి.
అంతే ఎంతో రుచి గా ఉండే బీన్స్ కర్రీ రెడీ.




